నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు పడిపోయాయి. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత వహించారు. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 75,867.80 వద్ద, నిఫ్టీ 6.55 పాయింట్లు నష్టపోయి 23,907.15 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.69గా నమోదైంది.
