భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

0చూసినవారు
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) అమ్మకాలు, అమెరికాలో బాండ్ రాబడులు పెరగడం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఒక దశలో 1200 పాయింట్లు పతనమై, చివరకు 570.59 పాయింట్లు నష్టంతో 71,909.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 198.50 పాయింట్లు తగ్గి 22,421.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 37 పైసలు క్షీణించి 96.31గా ఉంది.

సంబంధిత పోస్ట్