లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

52చూసినవారు
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 609.45 పాయింట్ల లాభంతో 77,496.36 వద్ద, నిఫ్టీ 181.95 పాయింట్ల లాభంతో 24,177.65 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 30లో ఐటీసీ, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ లాభపడ్డాయి. ఇండిగో, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 94.86గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 114 డాలర్లు, బంగారం ఔన్సు 4569 డాలర్లుగా ఉంది.

ట్యాగ్స్ :