స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో మనోవేదనకు గురై ఓ తండ్రి కన్న కొడుకుని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చెన్నైలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అన్నానగర్లో నివాసముండే నవీన్ కణ్ణన్(38)కు భార్య నివేదిత(35), కుమారుడు లవిన్(7) ఉన్నారు. నవీన్ స్టాక్ మార్కెట్లో నష్టపోయారు. ఆ విషయం భార్యకు చెప్పారు. దీంతో కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొడుకుని గొంతుకోసి చంపిన నవీన్.. రైలు కిందపడి చనిపోయారు. ఆ తర్వాత నివేదిత గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించారు.