దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ బలహీన పనితీరుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ తగ్గాయి. నిఫ్టీ 6.55 పాయింట్లు లేదా 0.03 శాతం నష్టపోయి 23,907.15 వద్ద, సెన్సెక్స్ 141.90 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టపోయి 75,867.80 వద్ద ముగిసింది.