దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సుమారు 250 పాయింట్లు తగ్గి 83,571కు చేరగా, నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 25,689 వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పాటు టెక్ షేర్ల నష్టాలు మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. రియల్టీ, ఫార్మా షేర్లు నష్టాల్లో ఉండగా, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.