అప్పాజీపేట గ్రామంలో రాళ్ల వర్షం.. ఏం జరుగుతోంది?

62చూసినవారు
అప్పాజీపేట గ్రామంలో రాళ్ల వర్షం.. ఏం జరుగుతోంది?
AP: అనంతపురం(D) పామిడి(M) అప్పాజీపేటలో వారం రోజులుగా గ్రామంలోని ఇళ్లపై రాళ్లు పడుతుండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమ ఇళ్లపై రాళ్లు పడుతున్నాయని వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు గస్తీ తిరుగుతున్న సమయంలో కూడా ఇళ్లపై రాళ్లు పడ్డాయి. గురువారం పోలీసులతో కలిసి గ్రామంలో సుమారు 20 మంది యువకులు సమీపంలోని కొండపైకి వెళ్లి పరిశీలిస్తుండగానే ఇళ్లపై రాళ్లు పడ్డాయి.

సంబంధిత పోస్ట్