
ప్రిన్సిపల్ బెదిరించాడని.. పాఠశాల భవనం పైనుంచి దూకిన విద్యార్థి!
మధ్యప్రదేశ్లోని రత్లాంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడాకారుడు, పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్కూల్కు ఫోన్ తీసుకురావడంతో యాజమాన్యం మందలించిందని, ప్రిన్సిపల్ తన కెరీర్ నాశనం చేస్తానని బెదిరించారని తోటి విద్యార్థులు ఆరోపించారు. అయితే, ప్రిన్సిపల్ గదిలో విద్యార్థి 52 సార్లు 'సారీ' చెప్పినట్లు సీసీటీవీలో రికార్డయింది. విద్యార్థి ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.




