నల్గొండ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. కలెక్టర్ ఆఫీస్ వెనక ఆర్టీవో కార్యాలయం వద్ద జిరాక్స్ షాపులు, హోటల్స్ రేకులు గాలికి ఎగిరిపోయాయి. కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు, ఇతర సామగ్రి వానకు తడిసిపోయాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. వడగండ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ భారీ ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పలుచోట్ల పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇండ్ల పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి.