
అల్లూరి సీతారామరాజుకు మాజీ సీఎం జగన్ నివాళి
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం బ్రిటీష్ పాలకులను ఎదిరించిన అల్లూరి పోరాటాన్ని స్మరించుకుంటూ, మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టడం ద్వారా గౌరవించినట్లు జగన్ తెలిపారు. స్వరాజ్య సాధన కోసం అల్లూరి చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.




