
HDFC బ్యాంక్ సేవల్లో రేపు అంతరాయం
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC, సిస్టమ్ అప్గ్రేడ్ పనుల కారణంగా రేపు (శనివారం) తెల్లవారుజామున 2:30 AM నుండి 6:30 AM వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఈ సమయంలో UPI లావాదేవీలు ఉదయం 5 గంటల తర్వాత, డెబిట్ కార్డుల ద్వారా రూ. 5,000 వరకు నగదు విత్డ్రాయల్స్, ఆన్లైన్ పేమెంట్స్, అలాగే 'Zapp' వాలెట్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని తెలిపింది. వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించింది.




