Top 10 viral news 🔥

అప్పటివరకు పెట్రోల్ ధరలు పెరగవు: ప్రభుత్వ వర్గాలు
దేశంలో ఏ పెట్రోల్ పంపులోనూ కొరత లేదని, సరిపడ నిల్వలు ఉండటంతో ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. క్రూడాయిల్ ధరలు 130 డాలర్లకు(ఒక బ్యారెల్కు) చేరే వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని చెప్పాయి. చమురు రేటు బ్యారెల్కు 100 డాలర్లుగా స్టెబిలైజ్ అవుతుందని, వివిధ మార్గాల ద్వారా క్రూడ్ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని వివరించాయి.




