
జ్యువెలరీ షాప్‌లో మహిళ ఘరానా మోసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండలో నిజాముద్దీన్ జ్యువెలరీస్ షాప్‌లో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. కూతురి పెళ్లి కోసం పాత బంగారాన్ని మార్చుకోవడానికి వచ్చి తన వద్ద ఉన్న బంగారు చైన్‌ను షాప్ యజమానికి ఇచ్చింది. ఆయన ఆ చైన్‌ను పరీక్షించి ఆమెకు కావాల్సిన కమ్మలు ఇచ్చాడు. ఆతర్వాత డబ్బులు తీసుకునే సమయంలో యజమానిని మాటలతో బురిడీ కొట్టించి తన వద్ద ఉన్న నకిలీ చైన్‌ను ఇచ్చి వెళ్ళిపోయింది. యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.




