వర్షాలు ఆపాలంటూ కలెక్టర్‌కు వింత ఫిర్యాదు

14చూసినవారు
వర్షాలు ఆపాలంటూ కలెక్టర్‌కు వింత ఫిర్యాదు
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాకు చెందిన సూరజ్ తివారీ అనే వ్యక్తి, కురుస్తున్న భారీ వర్షాలపై వినూత్నంగా స్పందిస్తూ, సెప్టెంబర్ 26న ప్రభుత్వ 'జన్‌సున్వాయ్ సమాధాన్' పోర్టల్‌లో ఆన్‌లైన్ ఫిర్యాదు చేశారు. వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తం అవుతోందని, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, పంట నష్టంపై రైతులు ఆందోళన చెందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంద్ర భగవానుడికి ఆదేశాలు జారీ చేసి వర్షాన్ని ఆపాలని కలెక్టర్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్