ఇండోర్ విమానాశ్రయంలోప్రయాణికుడికి కరిచిన ఎలుక

25545చూసినవారు
ఇండోర్ విమానాశ్రయంలోప్రయాణికుడికి కరిచిన ఎలుక
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విమానాశ్రయంలో బెంగళూరు వెళ్లడానికి సిద్ధమైన అరుణ్ మోదీ అనే ప్రయాణికుడి ప్యాంటులోకి ఎలుక దూరింది. ప్రయాణికుడు ప్యాంటు విప్పి ఎలుకను పట్టుకోగా, అది అతని తొడను కరిచింది. విమానాశ్రయంలో రేబిస్ ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడంతో, ప్రాథమిక చికిత్స అనంతరం అరుణ్ బెంగళూరు వెళ్లి అక్కడ ఇంజెక్షన్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న అరుణ్, ఈ సంఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :