
‘తప్పు జరిగితే ఈ సింహం ఊరుకోదు’.. పవన్‌పై బండ్ల గణేశ్ ట్వీట్
AP: గోదావరి కాలుష్యంపై అధికారులను ప్రశ్నిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను నిర్మాణ బండ్ల గణేశ్ పొగిడారు. మంగళవారం ఎక్స్ వేదికగా.. ‘సింహాన్ని నిద్ర లేపొద్దని ముందే చెప్పారు. ఆట మొదలైంది. తప్పు జరిగితే ఈ సింహం ఊరుకోదు. అవినీతి జరిగితే సహించదు. తాను నిద్రపోదు.. ఎవ్వరినీ నిద్రపోనివ్వదు. అది సింహం నైజం’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.




