AP: అనకాపల్లి జిల్లా రావికమతం ప్రభుత్వ హాస్టల్‌లోకి ప్రవేశించిన వీధికుక్క 12 మంది విద్యార్థులను గాయపరిచింది. గాయపడిన విద్యార్థులను నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. కురుపాంలో గిరిజన హాస్టల్‌లో పచ్చకామెర్ల ఘటన మరువకముందే మరో దారుణం జరగడంతో ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ లోపంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.