కేరళలోని కన్నూర్ జిల్లాలో వీధి కుక్కల బెడదపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన నాటకంలో ఊహించని సంఘటన జరిగింది. నటుడు పీ.రాధాకృష్ణన్ కుక్కల దాడిపై ఏకపాత్రాభినయం చేస్తుండగా, నిజంగా ఓ వీధికుక్క వచ్చి అతడిని కరిచింది. గాయపడ్డ ఆర్టిస్ట్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.