TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్న ప్రైవేటు కాలేజీల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు రాలేదన్న కారణంతో విద్యార్థులను వేధించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు విద్యార్థి సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.