దిల్లీ పేలుడు కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి: శ్రీ శ్రీ రవిశంకర్‌

0చూసినవారు
దిల్లీ పేలుడు కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి: శ్రీ శ్రీ రవిశంకర్‌
ఢిల్లీ పేలుడు ఘటనపై ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరపరాధులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొనడానికి ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి సామరస్యంగా పనిచేయాలని శ్రీ శ్రీ రవిశంకర్‌ హితవు పలికారు.

సంబంధిత పోస్ట్