కొత్త ఏడాది నుంచే కఠిన ఆర్థిక నిబంధనలు.. ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం

59చూసినవారు
కొత్త ఏడాది నుంచే కఠిన ఆర్థిక నిబంధనలు.. ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం
కొత్త సంవత్సరం ప్రారంభంతోనే పలు ఆర్థిక నిబంధనలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) కొత్త నిబంధనల ప్రకారం ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉపకరణాల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. కఠినతరం చేసిన నిబంధనల వల్ల, ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలు 4 స్టార్‌గా, 4 స్టార్ ఉపకరణాలు 3 స్టార్‌గా మారనున్నాయి. రేటింగ్ పెంచడానికి అదనపు ఖర్చుతో వీటిని మరింత సమర్థవంతంగా తయారు చేయాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :