దివ్యాంగులను కించపరిచేవారిపై కఠిన చట్టం: సుప్రీంకోర్టు సూచన

5336చూసినవారు
దివ్యాంగులను కించపరిచేవారిపై కఠిన చట్టం: సుప్రీంకోర్టు సూచన
దివ్యాంగులను కించపరిచే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, వివక్ష నిరోధకానికి రూపొందించిన చట్టంలాగే ఇది ఉండాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా, సమయ్‌ రైనాలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి ధర్మాసనం ఈ విషయాన్ని పేర్కొంది. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలని, వారి విజయాలను చాటిచెప్పేందుకు ఆన్‌లైన్‌ వేదికలను ఉపయోగించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్