
థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లో ఘర్షణలు.. సైనికుడు మృతి
థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దులో మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌లో కంబోడియా దళాలు థాయ్ దళాలపై కాల్పులు జరపడంతో, థాయ్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ ఘర్షణల్లో ఒక థాయ్ సైనికుడు మృతి చెందినట్లు థాయ్ సైన్యం వెల్లడించింది. ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కంబోడియా సైన్యం తొలుత దాడులు ప్రారంభించిందని థాయ్ అధికారులు ఆరోపిస్తుండగా, థాయ్ దళాలే కాల్పులు జరిపాయని కంబోడియా రక్షణ మంత్రిత్వశాఖ ఖండించింది.




