
అమెరికాలో ఉద్యోగాల సృష్టి 88% పతనం.. వలసల నియంత్రణతోనేనా?
అమెరికాలో అక్రమ వలసలు తగ్గడంతో 2025లో కొత్త ఉద్యోగాల కల్పన 88% పడిపోయింది. కన్స్ట్రక్షన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. సాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ రిజర్వ్ ఆర్థికవేత్తల పరిశోధన ప్రకారం, మార్చి 2024 నుండి సరిహద్దు నిఘా పెరగడంతో వలసలు తగ్గి, ఉపాధి మార్కెట్ చల్లబడింది. నిర్మాణ రంగంలో ఇళ్ల కొరత, ధరల పెరుగుదల, సేవా రంగాల్లోనూ కార్మికుల లభ్యత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ కఠిన వలస విధానాలు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చినా, లేబర్ మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయని, ఇది అమెరికా ఆర్థిక వృద్ధిని తగ్గించి, ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉందని ఫెడ్ హెచ్చరిస్తోంది.




