
మూత్రపిండాల ఆరోగ్యం: నీటి మోతాదుపై నిపుణుల సూచనలు ఇవే!
శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో మూత్రపిండాలకు నీరు అత్యంత కీలకం. అయితే, అతిగా లేదా తక్కువగా నీరు తాగడం రెండూ ప్రమాదకరమే. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం, తగినంత నీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచవచ్చు. పురుషులు రోజుకు సుమారు 3.7 లీటర్లు, స్త్రీలు 2.7 లీటర్లు నీరు తీసుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సూచిస్తోంది. అయితే, రోజూ 500 ఎంఎల్ కంటే తక్కువ నీరు తాగేవారికి దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ అని తెలిపింది.




