
అరుదైన శ్వేత నాగుకు శస్త్ర చికిత్స (వీడియో)
AP: విశాఖపట్నంలోని మల్కాపురంలో ఉన్న నేవీ క్యాంటీన్లో శుక్రవారం శ్వేతనాగు కనిపించడంతో నేవీ ఉద్యోగులు స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి పామును పట్టుకుని చూడగా.. పడగ దగ్గర గాయాలున్నాయి. పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యాధికారి సునీల్ కుమార్ పాముకు మత్తుమందు ఇచ్చి శస్త్ర చికిత్స చేశారు. గాయానికి ఎనిమిది కుట్టు వేశారు. ఏదైనా వాహనం శ్వేత నాగుపై ఎక్కి ఉండొచ్చని వైద్యాధికారి తెలిపారు.




