TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో, చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన 14 ఏళ్ల ప్రశాంత్ అనే బాలుడు సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుద్వేల్ బన్సీలాల్ నగర్ నివాసితులైన మోహన్, జ్యోతి దంపతుల కుమారుడైన ప్రశాంత్ 8వ తరగతి చదువుతున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.