TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కమ్మదనం గురుకుల వసతి గృహంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అశ్విని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన హాస్టల్ సిబ్బంది, టీచర్లు ఆమెను షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన గురుకులంలో తీవ్ర కలకలం రేపింది.