AP: తిరుపతి జిల్లాలో ఓ విద్యార్థి మద్యం సేవించి పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు మందలించారు. దాంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రగిరి మండలంలోని ముంగళిపట్టు గ్రామానికి చెందిన జస్వంత్ (15).. ఎం.కొంగరవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మద్యం తాగి స్కూల్‌కి రావడంతో విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్కూల్ వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు.