క్రికెట్ ఆడుతూ.. మోడల్ స్కూల్లో విద్యార్థి మృతి!

50చూసినవారు
క్రికెట్ ఆడుతూ.. మోడల్ స్కూల్లో విద్యార్థి మృతి!
TG: కొమరంభీం జిల్లా లింగాపూర్ ప్రభుత్వ మోడల్ స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా బంతి తీసుకురావడానికి ప్రహరీ గోడ ఎక్కిన 8వ తరగతి విద్యార్థి సాత్విక్(13) ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. అతడిని కాపాడేందుకు తోటి విద్యార్థులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు షాక్‌కు గురికాగా, మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్థులు స్కూల్ ఎదుట నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్