యూపీ ఝాన్సీలోని గుర్‌సరాయిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీఏ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల సదరు యువతి పిడకలు సేకరించడానికి గోశాలకు వెళ్లిన సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆపై ఫోన్‌లో ఆ దృశ్యాలను రికార్డ్ చేసి.. SMలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. అవమానం తట్టుకోలేక విషం తాగి ఆ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.