TG: ప్రిన్సిపల్ మందలించిందని 8వ తరగతి విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన ఘటన మధ్యప్రదేశ్ చోటు చేసుకుంది. రత్తాంలోని బోధి ఇంటర్నేషల్ స్కూల్‌కు చెందిన విద్యార్థి రిషాన్ కటారియా క్లాస్ రూమ్‌లో ఫోన్ యూజ్ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో టీచర్ ప్రిన్సిపల్‌కు కంప్లయింట్ చేసింది. ఈ క్రమంలో ప్రిన్సిపల్ రూమ్‌కు పిలిచి తిట్టడంతో.. ఏడుస్తూ బాలుడు 52సార్లు సారీ చెపాడు. అనంతరం స్కూల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడ్డాడు.