AP: పట్టపగలే ఓ విద్యార్థినిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రిలో చోటు చేసుకుంది. దువ్వూరు మండలం కానగూడూరుకు చెందిన మంత్రాల గౌస్, మస్తాన్‌బీ దంపతుల కుమార్తె షాజిదా డిగ్రీ చదువుతోంది. గురువారం కాలేజీకి వెళ్లిన షాజిదా.. అనారోగ్యంతో ఉ.11.30 గంటలకు ఇంటికి వెళ్లాలని పర్మిషన్ తీసుకుంది. కాలేజీ గేటు దగ్గర దుండగులు కిడ్నాప్ చేశారు. తండ్రి మంత్రాల గౌస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.