తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను ఇకపై విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపనున్నట్లు ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల హాల్ టికెట్లలో ఏవైనా తప్పులుంటే వాటిని ముందుగానే గుర్తించి సరిదిద్దుకునే అవకాశం కలుగుతుందని బోర్డు వెల్లడించింది. ఈ విధానం విద్యార్థులకు, తల్లిదండ్రులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.