
అమెరికాలో భారతీయులకు అవమానం (వీడియో)
అమెరికాలో రోడ్డు పక్కన ఫోటోలు తీసుకుంటున్న ఒక భారతీయ జంటను గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా అవమానించాడు. "మీరు ఇండియా నుంచి వచ్చారా?" అని ప్రశ్నించి, వారిని "వెంటనే మీ దేశానికే తిరిగి వెళ్లిపోండి" అంటూ బూతులు తిడుతూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ మొత్తం సంఘటనను బాధితులు తమ ఫోన్లో రికార్డ్ చేయగా, ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. విదేశాలలో భారతీయులపై ఇలాంటి వివక్ష, ద్వేషపూరిత దాడులు పెరుగుతుండటం పట్ల ప్రవాస భారతీయులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




