ఈ నెల 14న భూమికి తిరిగి రానున్న శుభాంశు శుక్లా

63చూసినవారు
ఈ నెల 14న భూమికి తిరిగి రానున్న శుభాంశు శుక్లా
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు జూలై 14న భూమికి తిరిగివస్తున్నారు. నాసా ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 25న నింగిలోకి వెళ్లిన వీరు 28 గంటలలో ఐఎస్‌ఎస్‌ చేరుకున్నారు. రెండు వారాలుగా అక్కడున్న శుభాంశు ఇప్పటివరకు 230 సూర్యోదయాలు చూశారు, 96.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, భూమిని 230 సార్లు చుట్టి వచ్చారు.

సంబంధిత పోస్ట్