కేంద్ర ప్రభుత్వం పట్టణ పేద, మధ్యతరగతి ప్రజల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 (PMAY-U 2.0) మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా, మొత్తం బడ్జెట్ రూ. 10 లక్షల కోట్లు కేటాయించారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 1.50 లక్షల వరకు, స్థలం లేనివారికి PPP మోడల్ ద్వారా EWS కుటుంబాలకు నిర్మించే గృహాలకు రూ. 1.50 లక్షల వరకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. గరిష్టంగా రూ. 8 లక్షల వరకు హోమ్ లోన్‌పై 5 ఏళ్లపాటు 4% వడ్డీ రాయితీతో రూ. 1.80 లక్షల వరకు సబ్సిడీ లబ్ధి చేకూరుతుంది.