DRDOకి చెందిన ఇద్దరు యువ శాస్త్రవేత్తలు ఒక వారంలో వరుసగా మృతి చెందడం కలకలం రేపుతోంది. నవంబర్ 21న బ్రహ్మోస్ మిషన్‌లో పనిచేసిన ఆకాష్ దీప్ గుప్తా (30) ఇంట్లో కుప్పకూలి మరణించగా, రెండురోజుల క్రితం పెళ్లి జరిగిన ఆదిత్య వర్మ నవంబర్ 27న హనీమూన్‌కు సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. ఆరోగ్య సమస్యలు లేకుండానే మరణించడంతో గుండెపోటు పై అనుమానాలు వ్యక్యం చేస్తున్నారు. పోస్ట్‌మార్టం తరువాతే కారణాలు తెలిసే అవకాశం ఉంది.