మెట్ గాలాలో రూ.142 కోట్ల నెక్లెస్‌తో సుధా రెడ్డి (వీడియో)

9చూసినవారు
మెట్ గాలా 2026లో, మేఘా కృష్ణా రెడ్డి భార్య సుధా రెడ్డి రూ. 142 కోట్ల ($15 మిలియన్లు) విలువైన అరుదైన నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నెక్లెస్ మధ్యలో 550 క్యారెట్ల భారీ ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ టాంజానైట్ రత్నం ఉంది. విక్టోరియన్ స్టైల్‌లో రోజ్-కట్ డైమండ్స్‌తో రూపొందించిన ఈ ఆభరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుధా రెడ్డి, మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ‘ట్రీ ఆఫ్ లైఫ్’ కలంకారీ గౌనులో మెరిసిపోయారు. ఈ గౌను తయారీకి 90 మంది కళాకారులు, 3,459 గంటల సమయం పట్టింది. సొంత కలెక్షన్‌లోని ఆభరణాలతో అంతర్జాతీయ వేదికపై సుధా రెడ్డి ప్రత్యేకతను చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్