కేంద్ర సమాచార కమిషనర్‌గా సుధారాణి రేలంగి

126చూసినవారు
కేంద్ర సమాచార కమిషనర్‌గా సుధారాణి రేలంగి
ఏపీకి చెందిన సుధారాణి రేలంగి కేంద్ర సమాచార కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం పెట్రోలియం, సహజవాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ఆమె నియామకానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామక కమిటీ సిఫార్సు చేసింది. గతంలో సీబీఐలో ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌గా, కేంద్ర న్యాయశాఖలో జాయింట్‌ సెక్రెటరీగా, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో జడ్జ్‌ అటార్నీ జనరల్‌గానూ పనిచేశారు. ఆమె స్వస్థలం ఏలూరు.

సంబంధిత పోస్ట్