
ఇండియన్ ఆర్మీలో 194 గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10, 12వ తరగతి, ITI ఉత్తీర్ణులైన వారు అర్హులు. మొత్తం 194 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 24 చివరి తేదీ. అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ, ఛాతీ 81.5 సెం.మీ., బరువు 50 కిలోలు, కనీస వయస్సు 18, గరిష్ట వయస్సు 25 ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.




