చీడపీడలు, తెగుళ్లు లేని ఆరోగ్యకరమైన, నాణ్యమైన చెరకు విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. చెరకు గడలోని మూడోవంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా వాడాలి. గడలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు మొలక శాతం ఆశాజనకంగా ఉంటుందని, అందుకే లేత భాగాలను విత్తనంగా ఉపయోగించడం ఉత్తమమని తెలిపారు. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల మూడుకళ్ల ముచ్చెలను విత్తనంగా వాడాలని నిపుణులు సలహా ఇచ్చారు.