మధ్యప్రదేశ్‌లో
నీట్ పరీక్షకు సిద్ధమైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం విషాదం కలిగించింది. మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష చతుర్వేది ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. నీట్‌లో మంచి ర్యాంకు సాధించి డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివిన ఆమె, పరీక్ష రద్దు వార్తలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో “సారీ అమ్మా, నాన్న.. మళ్లీ
నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు” అంటూ తన బాధను వ్యక్తం చేసింది. తన చదువు కోసం కుటుంబం చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ రాసిన ఆ లేఖ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.