
దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి గుప్పిట్లో భారత్: అధ్యయనం
భారత్లో దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం, 2023లో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్యలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. చైనాలో 15.2 కోట్ల మంది బాధితులు ఉండగా, భారత్లో 13.8 కోట్ల మంది ఈ రుగ్మతతో జీవిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ విశ్వవిద్యాలయాల సంయుక్త అధ్యయనంతో వచ్చిన ఈ నివేదికను ద లాన్సెట్ ప్రచురించింది. దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి ప్రాణాంతక వ్యాధుల జాబితాలో 9వ స్థానంలో ఉంది.




