అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను పొడిగింపు!

1చూసినవారు
అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను పొడిగింపు!
TG: రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా పలు విద్యాసంస్థలు వేసవి సెలవులను పొడిగిస్తున్నాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీలకు జూన్ 6 వరకు సెలవులు పొడిగించగా.. తాజాగా అంగన్‌వాడీల వేసవి సెలవులను కూడా పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. మే 1 నుంచి జూన్ 1 వరకు ప్రకటించిన సెలవులను, ఎండల తీవ్రత దృష్ట్యా చిన్నపిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 10 లేదా 15వ తేదీ వరకు పొడిగించే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్