సుందర్‌ అద్భుత క్యాచ్‌.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన వికెట్‌ ఇదే (వీడియో)

9చూసినవారు
ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించి స్వర్ణ పతకం నెగ్గింది. మ్యాచ్‌లో పాకిస్థాన్‌ దూకుడుగా ఆడుతున్న సమయంలో భారత బౌలర్‌ శివమ్‌ దూబే కీలక వికెట్‌ తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 14.1వ ఓవర్‌లో 126 పరుగుల వద్ద పాకిస్థాన్‌ బ్యాటర్‌ సైమ్‌ అయూబ్‌ (29)ను దూబే తొలి బంతికే ఔట్‌ చేశాడు. అయూబ్‌ భారీ షాట్‌కు ప్రయత్నించగా వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌ బ్యాటర్ల 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో మ్యాచ్‌ భారత్‌ వైపు మళ్లింది.
Video Credit: Sony Sports Network

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్