
విద్యుత్ యూనిట్‌కు 30 పైసలు తగ్గింపు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో కీలక ప్రకటనలు చేశారు. ఈ ఏడాది విద్యుత్ ప్రొక్యూర్మెంట్ ఖర్చును యూనిట్‌కు 30 పైసలు తగ్గిస్తామని, తద్వారా వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పంచాయతీల్లో 90 శాతం పన్నులను ఆన్లైన్లోనే చెల్లించేలా చర్యలు తీసుకున్నామని, ఇది పారదర్శకతను పెంచుతుందని పేర్కొన్నారు. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ఆయన అన్నారు.




