
ఎట్టకేలకు అమ్ముడుపోయిన పృథ్వీ షా
ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత క్రికెటర్ పృథ్వీ షా ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కనీస ధర రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అమ్ముడుపోని షా, ఈసారి కూడా మొదట అన్ సోల్డ్గా మిగిలిపోయాడు. అధిక బరువు, గాయాలు, ఫామ్ కోల్పోవడం వంటి కారణాలతో కెరీర్ డౌన్ ఫాల్ అయినప్పటికీ, ఇటీవల దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి మరో అవకాశం కల్పించింది.




