
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా?
సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, రిటైల్ ధరలను కొన్నేళ్లుగా సవరించకపోవడం వల్ల నష్టాలు పెరుగుతున్నాయని పేర్కొన్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలపై ఆంక్షలు, అమెరికా-ఇరాన్ చర్చలు కొలిక్కి రాకపోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ వారం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నాలుగేళ్ల గరిష్ఠం 126 డాలర్లకు చేరింది, ప్రస్తుతం 110 డాలర్లపైన కొనసాగుతోంది.




