సూపర్‌ ఎల్‌నినో ముప్పు.. క్లైమేట్‌ ట్రెండ్స్‌ నివేదిక

25చూసినవారు
సూపర్‌ ఎల్‌నినో ముప్పు.. క్లైమేట్‌ ట్రెండ్స్‌ నివేదిక
పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న సూపర్ ఎల్‌నినో కారణంగా భారతదేశం వాతావరణ సంక్షోభాన్ని, వ్యవసాయ, ఆర్థిక ముప్పును ఎదుర్కోనుందని క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ తెలిపింది. దేశ వాతావరణ పరిస్థితులపై విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ ఇప్పటికే వర్షపాత లోటు అంచున ఉంది. ఎల్‌నినో సూపర్ ఎల్‌నినోగా మారడం వల్ల నైరుతి రుతుపవనాలకు అంతరాయం ఏర్పడి, తక్కువ వర్షపాతం, సుదీర్ఘ డ్రై స్పెల్స్ వంటి పరిస్థితులు ఏర్పడతాయి. 2027 వరకు ఎల్‌నినో కొనసాగే అవకాశాలున్నాయని, 2024 అత్యంత వేడి సంవత్సరం రికార్డును 2026 అధిగమించవచ్చని నివేదిక పేర్కొంది.

సంబంధిత పోస్ట్